Hyderabad, జూలై 4 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలుతో ఫంక్షన్ అయిపోయింది. లోపలికి వెళ్దాం దా అని సత్యం అంటాడు. అయితే, ఇంటికెళ్లిపోదామని బాలు అంటాడు. ఇంతసేపు ఉండి తినకుండా వెళ్తే ఎలా ఉంటుందని సత్యం అంటాడు. మరి మలేషియా మనిషి ఎక్కడ అని బాలు అడిగితే రాలేదని సత్యం అంటాడు.

ఆయన రాడు నాన్న. పార్లరమ్మ చాలా తెలివైంది. ఏవో కథలు చెబుతుంది. వాళ్ల నాన్న మాత్రం రాడు అని బాలు అంటాడు. పూర్తిగా నిజం తెలియకుండా అనొద్దురా. ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్నావుగా. ఇప్పుడు కూడా అలాగే ఉండు అని సత్యం అంటాడు. మరోవైపు రోహిణిపై మీ నాన్న ఇంకెక్కడ, ఒళ్లు మండిపోతుంది అని అరుస్తుంది. కన్న కూతురు ఫంక్షన్‌లో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని కామాక్షి అంటుంది.

వాళ్ల నాన్న రాకుంటే తనేం చేస్తుందన విద్య అంటుంది. ఆయన కనీసం నీ షష్టిపూర్తికి అయినా వస్తాడా అని ప్రభ...