Hyderabad, సెప్టెంబర్ 27 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో చింటు అమ్మ అంటూ హాల్లోకి రావడంతో దగ్గరికి తీసుకుని రోహిణి ఏడుస్తుంది. నువ్ మా అత్తవి కాదుగా. మా అమ్మవేగా అని చింటు అంటే.. అవునురా. నువ్వు నా కన్న కొడుకువే. నా బంగారం అని రోహిణి అంటుంది. ఆ మాటలన్నీ విన్న మనోజ్, మీనా, బాలు నిలదీస్తారు.

అదంతా కల గంటుంది రోహిణి. లేచి వెళ్లి చింటుని చూస్తుంది. చింటు పక్కన మీనా పడుకుని ఉంటుంది. నీకు తల్లిగా ప్రేమ పంచలేదురా అని రోహిణి బాధపడుతుంది. ఇంతలో చింటు అమ్మా అంటూ లేస్తే మీనా ఓదారుస్తుంది. కనీసం మీనా ఉన్న స్థానంలో కూడా నేను లేకుండా పోయాను. క్షమించు నాన్న అని రోహిణి అనుకుంటుంది.

మరుసటి రోజు ఉదయం జరిగినదంతా తన ఫ్రెండ్ విద్యకు చెబుతుంది రోహిణి. చింటు నీ గొంతు గుర్తుపడితే చాలా పెద్ద సమస్య అవుతుంది అని విద్య అంటే.. నాకు దినదినగండంగా...