Hyderabad, సెప్టెంబర్ 5 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 504వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కొన్ని సరదా సీన్లు, మరికొన్ని ఉత్కంఠ రేపే సీన్లను ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. సంజూని చంపేస్తానంటూ బాలు ఆవేశంతోపాటు చివరికి అతడిని ఆట పట్టించే సీన్ వరకూ ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. అయితే మీనాకు ప్రభావతి ముద్దు పెట్టడమే హైలైట్.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (సెప్టెంబర్ 5) ఎపిసోడ్ సంజూ, మౌనికకు ఎవరి బెడ్ రూమ్ ఇవ్వాలన్న దానిపై అందరూ మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. మనోజ్ గది అయితే బాగుంటుందని ప్రభావతి అంటే.. ఆయనకు ఆ గదిలో తప్ప బయట నిద్ర పట్టదని, కుదరదని రోహిణి అంటుంది. తాను మౌనికకు రూమ్ ఇస్తాను కానీ ఆ సంజూకి ఇవ్వనని రవి అంటాడు. వాళ్లు మాట్లాడుకుంటుండగా.. చాటు విన్న సంజూ బెడ్ రూమ్ గురించి మాట్లాడుకుంటున్నారా? అయితే ఆ బాలుగాడి రూమ్ తీసుకొని వాడిని బ...