భారతదేశం, జనవరి 6 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 591వ ఎపిసోడ్ చింటుని దత్తత తీసుకోవాలనుకున్న బాలు, మీనా ప్లాన్.. ప్రభావతి డ్యాన్స్ స్కూల్, శృతిని రవి బతిమాలడం లాంటి సీన్లతో సాగిపోయింది. అయితే రోహిణి మరింత ఇరుక్కునే ప్రమాదం ఉండటంతో చింటు అమ్మమ్మ వాళ్లతో తెగదెంపులు చేసుకుంటుంది.

గుండె నిండా గుడి గంటలు మంగళవారం (జనవరి 6) ఎపిసోడ్ గుడిలో బాలు, మీనా.. చింటు దత్తత గురించి ఆ దేవుడినే అడిగే సీన్ తో మొదలవుతుంది. చిట్టీలు వేసి దేవత కాళ్ల దగ్గర పెట్టి ఇవ్వమంటుంది మీనా. రెండు చిట్టీల్లో ఒకటి మీనా తీస్తుంది. దత్తత తీసుకోవద్దని రావడంతో మీనా కంగారు పడుతుంది.

ఆ పని చేయొద్దని బాలుతో అంటుంది. కానీ బాలు మాత్రం దీనిని లైట్ తీసుకుంటాడు. మంచి పని చేస్తామంటే దేవుడు ఎందుకు వద్దంటాడు అని మీనాతో వాదిస్తాడు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందామంటూ ఇద్దరూ అక్కడ...