భారతదేశం, నవంబర్ 3 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వండిన చేపల పులుసు తినడానికి రెడీ అవుతారు. ప్రభావతిని మీనా రమ్మంటుంది. ఇంతలో మనోజ్ వస్తాడు. బయటకు వెళ్లి మాట్లాడుతారు. ఇచ్చావా, తెచ్చావా, సమస్య రాదుగా అని ప్రభావతి అంటే.. నాకైతే రాదు. అదే మనకేం రాదు అని మనోజ్ అంటాడు. ఏదో జరుగుతుంది అని మీనా డౌట్‌గా అంటుంది.

దాంతో మనోజ్‌ను లక్షలు మింగినోడా. మళ్లీ ఏం మింగి చచ్చావురా అని బాలు పిలుస్తాడు. ప్రభావతి, మనోజ్ వస్తారు. బయట ఇద్దరే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడితే ఏమైందని మీనా అడుగుతుంది. మళ్లీ కొంప మీదకు ఏం తీసుకొచ్చారు అని సత్యం అంటాడు. ఏం లేదని చెప్పిన ప్రభావతి రోహిణిని తీసుకురమ్మని మనోజ్‌కు చెప్పి పంపిస్తుంది.

మరోవైపు రోహిణి సంతోషపడుతుంటుంది. మనోజ్ రాగానే నాలుగు లక్షల ఫర్నిచర్ అమ్మడం ఏంటీ. లక్ష లాభం రావడం ఏంటీ సంతో...