భారతదేశం, డిసెంబర్ 29 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 585వ ఎపిసోడ్ లో బెస్ట్ కపుల్ గా బాలు, మీనా నిలుస్తారు. అది చూసి ప్రభావతితోపాటు మనోజ్, రోహిణి కుళ్లుకుంటారు. వాళ్లపై పడి ఏడుస్తారు. దీంతో బాలు తనదైన స్టైల్లో రోహిణిని అడ్డంగా ఇరికిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (డిసెంబర్ 29) ఎపిసోడ్ బెస్ట్ కపుల్ పోటీలో బాలు, మీనా చిన్న కల్లు కట్టే సీన్ తో మొదలవుతుంది. ఎందుకు అంత చిన్న ఇల్లు కట్టారని అడిగితే.. ఇంట్లో తమకు బెడ్ రూమ్ కూడా లేని విషయం చెప్పి.. ఇది తమ కలల ఇల్లు అని అంటారు.

ఆ తర్వాత విజేతను ప్రకటించే ముందు మనోజ్, రోహిణిల పేర్లు ముందుగా పిలుస్తారు. దీంతో తానే గెలిచానని మనోజ్ మురిసిపోతాడు. కానీ జడ్జీలు మాత్రం అతనికి క్లాస్ పీకుతారు. బ్రేక్ టైమ్ లో రోహిణితో మాట్లాడిన వీడియోను చూపించి పరువు తీస్త...