Hyderabad, సెప్టెంబర్ 19 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు సోఫా తిరిగి ఇవ్వడంపై సత్యం ఇంట్లో గొడవ జరుగుతుంటుంది. ఇదంతా చూస్తుంటే ఇద్దరికిద్దరు కావాలనే చేస్తున్నట్లుంది అని ప్రభావతి అంటుంది. నీ బాధేంటీ లక్షన్నర సోఫా సెట్ పోయిందనా. ఆ మాత్రం కొనలేమా అని బాలు అంటే.. నీ భార్య పూలమ్మి కొంటుందా అని ప్రభావతి అంటుంది.

పూలమ్మే కారు కొనిపెట్టింది అని బాలు అంటాడు. ప్రతిదానికి సమాధానం చెబుతావ్. అందరిని అదరగొడతావ్ అని రవి అంటాడు. రౌడీ కదా అలాగే చేస్తాడు. ఇంకోసారి ఇంట్లో పెత్తనం చేస్తే ఊరుకోను అని మనోజ్ అంటాడు. ఏం చేస్తావురా అని మనోజ్ కాలర్ పట్టుకుంటాడు బాలు. రవి అంటే రవి కాలర్ కూడా పట్టుకుంటాడు బాలు. మీనా, ప్రభావతి అంతా ఆపాలని చూస్తారు. కానీ, బాలు ఆగడు.

ఆపండి అని సత్యం అరుస్తాడు. ఇక్కడ నేను లేననుకున్నారా. ఇప్పుడు జరిగింది మార్...