భారతదేశం, డిసెంబర్ 3 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ చేసిన మురికిని ఎలా కడగాలో చెప్పండి అని మీనా అంటుంది. అమ్మలానే వీడు తయారయ్యాడు అని బాలు అంటాడు. నాలుగు రోజులు నీ నగలు నీ మొహాన పడేస్తాను అని మనోజ్ అంటాడు. దాంతో మనోజ్ కాలర్ పట్టుకుని ఏం పడేస్తావ్. దొంగతనం చేసి అమ్ముకుంది కాక అంటున్నావా అని తెగ కొడతాడు సత్యం.

ప్రభావతి ఆపడానికి వస్తే తనను తోసేసి ఇంకా ఫైర్ అవుతాడు. నన్ను ముట్టుకోకు. అసలు నిన్ను కొట్టాలి అని ప్రభావతిపై చేయి ఎత్తుతాడు సత్యం. మళ్లీ ఆగిపోతాడు. ఎందుకింతా చేశావ్ అని నిలదీస్తాడు సత్యం. జరిగిన మోసాన్ని ఇలా దాస్తావా అని చివాట్లు పెడతాడు సత్యం. మాట్లాడితే బిజినెస్ మ్యాన్ అంటావ్. నా భార్య నగలు ఎలా దొంగతనం చేశావురా అని బాలు కొడతాడు.

రవి ఆపుతాడు. ఎందుకు వాన్ని ఆపుతున్నారు అని సత్యం అంటాడు. అందరు మనోజ్‌ను కొట...