భారతదేశం, డిసెంబర్ 26 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 584వ ఎపిసోడ్ కూడా బెస్ట్ కపుల్ కాంపిటీషన్ చుట్టూ తిరిగింది. మరో మూడు రౌండ్లు నిర్వహించిన తర్వాత మీనా, బాలును బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తారు. దీంతో మనోజ్, రోహిణితోపాటు ప్రభావతి కూడా షాక్ తింటారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 26) ఎపిసోడ్ ప్రభావతి నడుము విరిగే సీన్ తో మొదలవుతుంది. అయితే స్టేజ్ పైనే రోహిణి, శృతిలతో కలిసి మీనా సెట్ చేస్తుంది. అయితే అక్కడితో ప్రభావతి పోటీ ముగుస్తుంది. దీంతో బాలు, కామాక్షి ఆమెను ఏడిపిస్తారు.

తాను గెలవకపోయినా నువ్వు ఓడిపోయినందుకు సంతోషంగా ఉందని కామాక్షి అంటుంది. ఇక వెళ్దాం.. ముందు కిలోల లెక్కన చీరలు అమ్ముతున్నారంటా అంటూ ప్రభావతితో కామాక్షి చెబుతుంది. మీరే గెలిచి రావాలని, తాను ఇంటి దగ్గర హారతి పట్టుకొని ఉంటానని మనోజ్, రోహిణిలక...