భారతదేశం, డిసెంబర్ 22 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోతిష్కుడుని మనోజ్ కలుస్తాడు. తాను చెప్పినట్లుగానే రోజు రంగుల బట్టలు వేసుకోవాలని, ఇవాళ ఈ షర్ట్ వద్దని విప్పిస్తాడు జ్యోతిష్కుడు. షర్ట్ విప్పించి కండువా ఇస్తాడు. నీ బట్టలు నీ భార్య మాత్రమే ఉతకాలి. నీకు అదృష్టం మొదలై కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడని జ్యోతిష్కుడు అంటాడు.

అంటే దానికోసం కూడా మావోడు ఏం చేయక్కర్లేదా అని మనోజ్ ఫ్రెండ్ అంటాడు. మరోవైపు బాలు హుండీ డబ్బా తీసుకొస్తాడు. దీంతో అడుక్కుంటున్నావురా అని ప్రభావతి అంటే మీనా పంచ్‌లు వేస్తుంది. ఆయనకు అడుక్కునే గతి పట్టలేదు. ఆయన మనోజ్ కాదు అని మీనా అంటుంది. ఇంతలో మనోజ్ అడుక్కునేవాడిలా పిలుస్తాడు. అంతా చూసి షాక్ అవుతారు.

విచిత్రంగా మాట్లాడుతూ ఎవరిని ముట్టుకోనివ్వడు మనోజ్. హుండి సంగతి చెప్పురా అని సత్యం అం...