భారతదేశం, డిసెంబర్ 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 572వ ఎపిసోడ్ లో బిడ్డను కనడం ఎంత కష్టంగా ఉంటుందో మీనా, శృతిలకు చెప్పి అడ్డంగా ఇరుక్కుంటుంది రోహిణి. అటు నగలు, డబ్బు, సత్యం అలక వంటి సీన్లు ఈ ఎపిసోడ్ లోనూ కొనసాగాయి. మొత్తంగా ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 10) ఎపిసోడ్ రోహిణి, మనోజ్ ఇంటికి డబ్బు తీసుకొచ్చి హడావిడి చేసే సీన్ తో మొదలవుతుంది. రోహిణి వచ్చి అందరినీ పిలవమంటుంది. ప్రభావతి వస్తే తాను వెళ్లిపోతానని సత్యం చెప్పినా.. అందరూ ఉండాలని అంటుంది.

మీనా, బాలు, ప్రభావతి వస్తారు. నగలు మింగాడని మనోజ్ ను బాలు నానా మాటలు అంటున్నాడు కదా అందుకే డబ్బు తీసుకొచ్చానని చెబుతుంది. అంత డబ్బు ఎక్కడిది అని ప్రభావతి అడిగితే మా నాన్న పంపించాడని అంటుంది. ఆయన జైల్లో ఉన్నాడు కదా అని సత్యం అడుగుతాడు. జైల్లోనూ ...