భారతదేశం, ఫిబ్రవరి 17 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనా తలకు దెబ్బ తగలడంతో తానే వంట చేస్తానని వంట గదిలోకి వెళ్తుంది ప్రభావతి. అది చూసి సత్యం, బాలు, మీనా అంతా ఆశ్చర్యపోతారు. కిచెన్ మొత్తం మార్చేసిందని అనుకుంటుంది ప్రభావతి.

ఉప్పు, కారం ఎక్కడ పెట్టావంటూ మీనాను పిలుస్తూనే ఉంటుంది ప్రభావతి. దాంతో బాలు వెళ్లి ఈ మాత్రం దానికి వంట చేస్తానని రావడం ఎందుకు అంటాడు. మా అమ్మ అరిచి గీ పెట్టిన బయటకు రావొద్దని మీనాను తీసుకెళ్తాడు బాలు. మరోవైపు రెండు చేతులకు కట్టులతో ఉంటాడు గుణ.

ఇన్నాళ్లు నేను ఇచ్చిన డబ్బులు తీసుకుని నాతోనే గొడవ పెట్టుకుని వెళ్లాడురా శివ గాడు. పైకి పంపించాలి. బావ బామ్మర్దులిద్దరికి స్పాట్ పెట్టాలని గుణ అంటాడు. ఇంతలో రోహిణి వచ్చి డబ్బు కాదు హెల్ప్ అడుగుతుంది. దినేష్ మళ్లీ వచ్చి లక్షల్లో అడుగుతున్నాడని, ఇంకోసారి వాడ...