Hyderabad, సెప్టెంబర్ 8 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు, మీనాలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతారు అందరు. చొక్కా బాగుందిరా అని సుశీల అంటే.. మీనా వాళ్ల అమ్మగారు పెట్టారని బాలు చెబుతాడు. షర్ట్ ఇచ్చి ప్యాంట్ ఇవ్వడం మర్చిపోయారని కౌంటర్ ఇస్తుంది ప్రభావతి. మా అమ్మ ఇచ్చింది మర్చిపోతుంది, ఇవ్వనిది గుర్తుపెట్టుకుంటుంది అని బాలు పంచ్ ఇస్తాడు.

ఒరేయ్ మీ పెళ్లి రోజు అని ఉంగరాలు చేయించాను. ఉంగరాలు మార్చుకోండి అని ఇస్తుంది సుశీల. మనం కూడా పెళ్లి రోజు చేసుకుందామండి. మీ అమ్మగారు ఏమిస్తారో అని ప్రభావతి అంటే.. ముక్కు పుడక ఇస్తానే అని సుశీల అంటుంది. మీనా, బాలు ఉంగరాలు మార్చుకుంటారు. మీనా మురిసిపోతుంది. అత్తగారింటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని రండని సత్యం చెబుతాడు.

గుడికి వెళ్లి అర్చన చేపిద్దామని సత్యం ప్రభావతిని తీసుకెళ్తాడు. సంజుకు...