Hyderabad, ఆగస్టు 25 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బారుకెళ్లిన మీనా భర్త బాలు గురించి, పడిన నింద గురించి జరిగింది అంతా చెబుతుంది. ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. నీకు నిజం చెప్పేవారు ఎవరుంటారు అని బారు ఓనర్ అంటే.. సీసీ కెమెరా చూపిస్తుంది. దయచేసి కెమెరాలో రికార్డ్ అయింది చూపిస్తే నా భర్త ఇందులో నుంచి బయటపడతారు. మీ కూతురు లాంటిదాన్ని సహాయం చేయండి అని మీనా అంటుంది.

దాంతో ఓనర్ సరే అని ఒప్పుకుని వర్కర్‌ని పిలిచి సీసీటీవీ ఫుటేజ్ చూపించమంటాడు. బాలు తాగనిది, కేవలం చికెన్ తినేది, గుణ వీడియో తీయడం అంతా చూస్తారు. కావాలనే చేశారు అని ఇద్దరు అనుకుంటారు. మా మరిది రవి నెంబర్ ఇస్తాను. అతనికి పంపించండి అని మీనా అంటే.. అతను పంపిస్తాడు. దాంతో థ్యాంక్స్ చెప్పి. చాలా సహాయం చేశారు అని మీనా చెబుతుంది.

ఆ వీడియోను రవి చూస్తాడు. మీనా కాల్ చేసి...