భారతదేశం, జూన్ 18 -- మీనా త‌న‌కు కొనిచ్చిన కారును కుటుంబ‌స‌భ్యుల‌కు చూపిస్తాడు బాలు. కారు వెనుక బీఎమ్ అంటూ బాలు, మీనా పేర్లు రాసి ఉండ‌టంపై ప్ర‌భావ‌తి సెటైర్లు వేస్తుంది. అంద‌రూ అమ్మదీవెన అని రాయించుకుంటే బాలు మాత్రం పెళ్లాం పేరు రాయించుకున్నాడ‌ని బాలుపై విరుచుకుప‌డుతుంది. పాత కారు కొని ఏదో విమానం కొన్న‌ట్లు బిల్డ‌ప్పులు ఇస్తున్నార‌ని కుళ్లుకుంటుంది.

నీ దీవెన‌లు ఎక్క‌డున్నాయి శాప‌నార్థాలు త‌ప్ప అని ప్ర‌భావ‌తిని స‌త్యం నిల‌దీస్తాడు. బాలు కారు అమ్మేశాడ‌ని తెలిసి నా ఇళ్లు, నా ప‌త్రాలు అని గొడ‌వ చేసి ఇప్పుడు కారు వెనుక నీ పేరు రాయ‌లేద‌ని లా అడుగుతున్నావ‌ని స‌త్యం అంటాడు. పేరు వేయ‌డానికి అర్హ‌త ఉండాల‌ని శృతి అంటుంది. బాలు, మీనాల‌కు కంగ్రాట్స్ చెబుతారు శృతి, ర‌వి. తాను కారు కొన‌డం ప్ర‌భావ‌తి ఓర్వ‌లేక‌పోతుంద‌ని బాలు బాధ‌ప‌డ‌తాడు.

నేను చేయ‌లేని ...