Hyderabad, ఆగస్టు 20 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 492వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు తాగాడంటూ ఇంట్లో వాళ్లు అందరూ నిందిస్తారు. మీనా, సత్యం కూడా అతడు చెప్పిన మాట వినరు. అయితే బాలుని కాపాడుతుంది చెల్లి మౌనిక. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఆగస్టు 20) ఎపిసోడ్ మీనాను ప్రభావతి నిలదీసే సీన్ తో మొదలవుతుంది. భార్యగా అతన్ని కంట్రోల్ చేయలేదు కాబట్టే ఇలా తాగుబోతుగా మారాడని అంటుంది. దీంతో మీనా కోపం కట్టలు తెంచుకుంటుంది. ప్రభావతిపై విరుచుకుపడుతుంది. నేను తాగుబోతు భార్యనైతే మీరు తాగుబోతు తల్లా అని అడుగుతుంది. తాను ఇంట్లోకి వచ్చి కొంతకాలమే అయిందని, మీ కొడుకు తాగకుండా పెంచడం మీకు చేతకాలేదా అని నిందిస్తుంది. అటు సత్యం కూడా మీనాకు సపోర్ట్ చేస్తాడు. తప్పు చేసింది బాలు అయితే మీనాను ఎందుకు నిల...