Hyderabad, ఆగస్టు 15 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 489వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ఎపిసోడ్ లో బాలు దగ్గర మీనా నిజం దాచడం, అటు మౌనికను సంజూ మరోసారి అవమానించడం, రోహిణిని దినేష్ మళ్లీ బ్లాక్‌మెయిల్ చేయడం, బాలు పెద్ద గొడవలో ఇరుక్కుంటాడని జ్యోతిష్యుడు హెచ్చరించడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మౌనికతో మీనా మాట్లాడే సీన్ తో మొదలవుతుంది. తాను ఎంత చెప్పినా మౌనిక వినకపోవడంతో ఆమెను తన అత్తవారింటి దగ్గర వదిలి ఇంటికి వచ్చేస్తుంది మీనా. ఆమె అదోలా ఉండటం చూసి బాలు ఏమైందని అడుగుతాడు. అసలు విషయం చెబితే అతడు ఎక్కడ గొడవ చేస్తాడో అని ఏమీ లేదని, చాలా ఆలస్యంగా పూలు డెలివరీ చేయడంతో అలిసిపోయానని అబద్ధం చెబుతుంది. అంతేకదా.. ఎవరూ నిన్ను అల్లరి చేయలేదు కదా అని బాలు అంటాడు. అవును అంటుంది మీనా.

అటు సంజూ త...