భారతదేశం, నవంబర్ 26 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 562వ ఎపిసోడ్ లో మౌనికను పుట్టింటి వాళ్లకు దూరంగా ఉండాలని సంజూ వార్నింగ్ ఇవ్వడం, మౌనిక గురించి మీనా నిజం దాచడం, మనోజ్ రూ.4 లక్షల గురించి బాలు నిజం తెలుసుకోవడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు బుధవారం (నవంబర్ 26) ఎపిసోడ్ గుడిలో సంజూపై బాలు చేయి చేసుకునే సీన్ తో మొదలైంది. తన చెల్లిని నానా మాటలు అనడంతో బాలు తట్టుకోలేక సంజూని చితకబాదుతాడు. అది చూసి మౌనిక తన అన్న అని కూడా చూడకుండా బాలు చెంప పగలగొడుతుంది.

ఇది తనకు, తన భర్తకు సంబంధించిన విషయం అని, ఆయనను కొట్టడానికి నువ్వు ఎవరు అని బాలుని మౌనిక నిలదీస్తుంది. ఆ తర్వాత ఆమెను బలవంతంగా తీసుకొని సంజూ వెళ్లిపోతాడు.

ఇటు అల్లుడిని బాలు కొట్టడంతో ఇంట్లో బాలుని ప్రభావతి నిలదీస్తుంది. అతన్ని రవి, మనోజ్, రోహిణి కూడా తప్పుబడతార...