భారతదేశం, డిసెంబర్ 31 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో రాత్రిపూట మీనాపై పడిపోతుంటాడు బాలు. మీనా ఆపుతుంది. ఇంతకుముందు వాడు ఎలా ఉండేవాడు. అచ్చోసిన ఆంబోతులా తిరిగేవాడు అని బాలు అంటాడు. మీకు అన్ని దుర్గుణాలు లేవు. తాగేవారు. దాంతో గొడవ పడేవారు. అది లేకుంటే అని మీనా అంటే.. అచ్చోసిన ఆంబోతులా తిరిగేవాడిని. ఏం లేదంటూనే అన్ని అన్నావుగా అని మీనాకు చక్కిలిగింతలు పెడతాడు బాలు.

మావయ్య సంతోషించేలా ఉండాలి. రూమ్ కట్టుకుందామండి. ఇంజినీర్ వద్దు మేస్త్రీని మాట్లాడుకుందామని మీనా అంటుంది. అప్పుడు మనం మన రూమ్‌లో అని ఇద్దరు రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తుంటారు. ఇంతలో ప్రభావతి వచ్చి చూస్తుంది. మీనా ఆగిపోతుంది. బాలు కూడా ఆగిపోతాడు. ఊకే ఇలా విజిల్ ఊదుకుంటూ వస్తే మాకు కాళరాత్రి తప్పా ఇంకేం మిగులుతుంది అని బాలు అంటే.. ప్రభావతి కోపంగా వెళ్తుంది.

మరు...