భారతదేశం, డిసెంబర్ 18 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో కారులో ప్రభావతి, సత్యం కలిసిపోవడం గురించి మాట్లాడుకుంటారు. తల్లి చెప్పడంతో ప్రభావతికి సత్యం బొట్టు పెడతాడు. అంతా చప్పట్లు కొడతారు. ఇంట్లో మూడు జంటలు ఉన్నాయి. మీరు ఆదర్శంగా ఉండాలంటుంది సుశీల. తప్పు తాను చేసిన రవినే సారీ చెప్పాలన్న కండిషన్ మీదే పెళ్లి చేసుకున్నామని శ్రుతి చెబుతుంది.

ఇదివరకు ఓ సారి ఇలాగే గొడవ పడితే సర్దిచెప్పాను. తర్వాత రవిగాడిని కని చేతిలో పెట్టారని సుశీల అంటుంది. దాంతో ఇప్పుడు సత్యం, ప్రభావతి మరోకరిని కంటారు అనేలా మొహాలు పెడతారు. ఇప్పుడు కూడా సర్దిచెప్పావుగా. ఇంకో పది నెలల్లో తమ్ముడు పుడతాడా అని బాలు అంటాడు. అంతా నవ్వుతారు. ఇవాళ నా చేత్తో మీకు వండిపెడతాను అని సుశీల అంటుంది.

మరోవైపు సంజు ఫంక్షన్‌కు వెళ్తే భార్యతో కూడా రమ్మన్నారుగా. తీసుకెళ్లు అని త...