Hyderabad, జూన్ 27 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నల్లపూసల వేడుక జరిగే ఫంక్షన్ హాల్‌కు సత్యం కుటుంబం వస్తుంది. ప్రభావతి హడావిడి చేస్తుంది. బాలు నువ్వేందుకురా తలొంచుకుని వస్తున్నావ్ అని కామాక్షి అంటుంది. దాంతో తాను మాట్లాడకూడదు అన్నట్లుగా సైగ చేస్తాడు బాలు.

ముందుకు పడితే మూతి పళ్లు రాలాయ. అయ్యయ్యో. పళ్ల సెట్టు కొనుక్కునే టైమ్ లేదా అని కామాక్షి అంటుంది. సరే పదండి అని ప్రభావతి తీసుకెళ్తుంది. మీ నాన్న ఇంకా రాలేదా అని రోహిణిని మనోజ్ అడిగితే.. వస్తున్నారు అని చెబుతుంది. కారులా ఫంక్షన్ అయిపోయేవరకు సౌండ్ చేయకూడదని బాలుకు చెబుతుంది మీనా. తండ్రిని వెళ్లి హగ్ చేసుకుంటుంది శ్రుతి.

సత్యం అని సురేంద్ర పిలిస్తే అంతా షాక్ అవుతారు. శోభన చూడటంతో నమస్కారం బావగారు అని సురేంద్ర అనేసరికి అంతా అవాక్కవుతారు. రోహిణి తరఫు వాళ్లు రాలేదా అని శ...