భారతదేశం, జనవరి 13 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో పెళ్లికి ముందు రోహిణి గతం మనకు తెలియదు. నువ్వు అన్ని దాంతో చెప్పావ్. కానీ, అది అన్నీ నీతో చెప్పిందని గ్యారెంటీ ఏంటీ. అన్ని వైపుల ఆలోచించు. తను నీ దగ్గర ఏదో దాస్తుందని అనిపిస్తుంది. నిదానంగా ప్రేమగా అడిగి తెలుసుకో అని ప్రభావతి సలహా ఇచ్చి వెళ్లిపోతుంది.

మరోవైపు బాలు డబ్బు లెక్కపెడుతుంటాడు. మీనా వస్తుంది. రాత్రి అయింది, చల్లగాలి వస్తోంది అని రొమాంటిక్‌గా అడుగుతుంది మీనా. కానీ, బాలు ఏంటీ గోల అని చిరాకు పడతాడు. రోహిణి పిల్లల కోసం పరీక్ష చేసుకుంది కదా. మనకు వాళ్లకంటే ముందు పెళ్లి అయిందిగా. మనకేగా ముందు పిల్లలు పుట్టాలి అని మీనా అంటుంది.

దానికి షాక్ అయిన బాలు పిల్లలు అంటే డైపర్స్ వాటికే డబ్బు అయిపోతుంది. వద్దని బాలు అంటాడు. దాంతో మీనా వెనక్కి తిరిగి మల్లెపూలతో, అందంతో రెచ్...