భారతదేశం, డిసెంబర్ 17 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 577వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి, సత్యంలను కలపాలన్న సుశీల, బాలు ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఆ ఇద్దరూ బాగా కలిసిపోతారు. అయితే చివర్లో బాలు ఎవరో తెలియదంటూ చెల్లి మౌనిక అతన్ని మెడపట్టి బయటకు గెంటేయించడంతో బాలు షాక్ తింటాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 17) ఎపిసోడ్ మనోజ్ తనకు అందిన లెటర్ గురించి టెన్షన్ పడుతున్న సీన్ తో మొదలవుతుంది. అసలు ఈ పనిని ఎవరు చేశారా అని ఆలోచిస్తుంటాడు. బాలు, మీనానా లేక ఇంకా ఎవరైనా చేశారా అంటూ.. రోహిణి వెంట వచ్చిన విద్యను కూడా అతడు అనుమానిస్తాడు. అటు మనోజ్ ను టెన్షన్ పడొద్దని చెప్పి విద్యతో కలిసి పక్కకు వెళ్లిన రోహిణి కూడా లెటర్ పై ఆందోళన చెందుతుంది. దినేష్ ఏమైనా చేశాడా అని విద్యతో అంటుంది.

ఇటు ఇంటికి రెండో పెళ్లాన్ని తీసుకొచ్చానంటూ...