Hyderabad, సెప్టెంబర్ 16 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 511వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ షాపు ఓపెన్ చేసిన ప్రభావతి బోణీ విషయంలో రచ్చ చేయడం, ఆమెకు సత్యం క్లాస్ పీకడం జరుగుతుంది. అంతేకాదు మనోజ్ షాపులో కొన్న సోఫాను వాళ్ల ఇంటికే శోభ పంపడంతో ఇంట్లో బాలు మరో గొడవ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 16) ఎపిసోడ్ మనోజ్ షాపు ఓపెనింగ్ ఎవరు చేయలన్న సీన్ తో మొదలవుతుంది. ప్రభావతితో చేయించాలని సత్యం కూడా చెబుతాడు. అటు రోహిణి కూడా అత్తయ్య చేత్తో చేస్తే మంచే జరుగుతుందని అంటుంది. దీంతో మనోజ్ కూడా సరే అంటాడు. ఆ మాట విని ప్రభావతి ముఖం వెలిగిపోతుంది. అది చూసి బాలు ఆమెను ఆట పట్టిస్తాడు.

షాపు ఓపెన్ చేయడానికి ప్రభావతి సిద్ధమవుతుంది. ముఖ్యమైన గెస్టు కోసం ఎదురు చూస్తున్నానంటూ ఆమె అందరినీ వెయిట్...