Hyderabad, జూలై 31 -- స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు గురువారం (జులై 31) 478వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రౌడీలను బాలు తరిమేయడం, అది ప్రభావతి చూడటం, ఆ తర్వాత ఇంట్లో పెద్ద గొడవ చేయడం, ఆ పెద్దాయన బాలుని కాపాడటం లాంటి సీన్లు ఈ ఎపిసోడ్లో చూడొచ్చు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (జులై 31) ఎపిసోడ్ రౌడీలను బాలు బతిమాలే సీన్ తో మొదలవుతుంది. ఆ పెద్దాయన కూతురి పెళ్లి అన్నా.. దయచేసి ఖాళీ చేయండన్నా అంటూ బతిమాలుతాడు. ఎంత చెప్పినా వాళ్లు వినరు. బాలుపై దాడికి ప్రయత్నిస్తారు.

దీంతో బాలు ఎదురు తిరుగుతాడు. ఆ రౌడీలను చితగ్గొడతాడు. ఈ క్రమంలో బాలుకు ఓ కత్తి గాయం కూడా అవుతుంది. అయినా వినకుండా రౌడీలను కాళ్ల బేరానికి తీసుకొస్తాడు. వాళ్లు భయపడి అక్కడి నుంచి పారిపోతారు.

ఆ రౌడీలు బైకులపై పారిపోతుండగా వాళ్లకు ప్రభావతి, కామాక్షి ఎదురవుతారు. వాళ్...