భారతదేశం, జనవరి 16 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 599వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తాను వద్దన్నా తమ్ముడి బర్త్ డే కోసం వెళ్లిన మీనాతో బాలు తాగొచ్చి గొడవ పడతాడు. అది చూసి ప్రభావతి ఎంతో సంతోషిస్తుంది. వాళ్లకు గొడవకు తామే కారణం అంటూ పార్వతి, సుమతి వెళ్లి బాలుకి క్షమాపణ చెబుతారు.

గుండె నిండా గుడి గంటలు శుక్రవారం (జనవరి 16) ఎపిసోడ్ మీనాతో బాలు గొడవ పడే సీన్ తో మొదలవుతుంది. బాలు బాగా తాగి వస్తాడు. ఇంటి బయటే మీనాతో గొడవ పడతాడు. తన మాట కాదని గుడికి వెళ్లిన మీనాపై మండిపడతాడు. తన తమ్ముడిపై ప్రేమతోనే తాను వెళ్లానని, వాడు తండ్రి లేని పిల్లాడని మీనా అంటుంది.

అంటే నా మీద ప్రేమ లేదా.. వాడు గొప్పగా చదువుతున్నాడు.. నేను కేవలం డ్రైవర్ అనే ఇలా చేస్తున్నావా అని బాలు మరింత చెలరేగుతాడు. అతన్ని బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్తుంది. బాలు మాత్రం తినమన్నా తినక...