భారతదేశం, డిసెంబర్ 8 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో గుడిలో ప్రభావతిని కలిసి శ్రుతి తల్లి శోభన బంగారు గాజుల గురించి అడుగుతుంది. స్నానానికి వెళ్లేటప్పుడు దిండు కింద పెట్టి మర్చిపోయావా అని కామాక్షి ఐడియా ఇస్తుంది. దానికి అవును అలాగే మర్చిపోయా అని ప్రభావతి అంటుంది.

మీకు మతిమరుపు ఉందా. వయసు అయిపోతుందిగా. మరికొన్ని రోజుల్లో పళ్లు కూడా ఊడిపోతాయ్ అని శోభన అంటుంది. మీరు నన్ను బలవంతంగా వృద్ధాప్యంలోకి నెట్టేస్తున్నారు అని ప్రభావతి అంటుంది. మీకు ముగ్గురు కోడళ్లు. మీ చిన్న కోడలు నా కూతురు. మీకన్నా చిన్నదాన్ని అని శోభన అంటే.. శ్రుతి తర్వాత మరో ఇద్దరిని కనేంత చిన్నది పాపం అని సెటైర్లు వేస్తుంది కామాక్షి.

ఆవిడకు కూడా మతి మరుపు వచ్చినట్టుంది. గుడికి వచ్చిన విషయం మర్చిపోయి సోది పెడుతుందని మళ్లీ సెటైర్లు వేస్తుంది కామాక్షి. దాంతో ప్ర...