భారతదేశం, డిసెంబర్ 9 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 571వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో వాళ్ల దెబ్బకు ప్రభావతి, మనోజ్, రోహిణి మొహాలు మాడిపోతాయి. పౌరుషానికి పోయి డబ్బులు ఇవ్వబోయిన రోహిణి ఇరుక్కుంటుంది. అటు ప్రభావతిని సత్యం పూర్తిగా దూరం పెట్టేస్తాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (డిసెంబర్ 9) ఎపిసోడ్ మనోజ్, రోహిణి, ప్రభావతిలకు మీనా క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. ఆ ముగ్గురూ టిఫిన్ చేయడానికి నిరాకరించడంతో మీనా వాళ్లకు చురకలు అంటిస్తుంది. మీరు దోచుకున్న రూ.4 లక్షలే అడిగింది.. అది తెలుసుకొని మాట్లాడితే అందరికీ మర్యాదగా ఉంటుంది.. ఈ ఇంట్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు.. మేమేం మూసుకున్నాం.. కాసేపట్లో మా ఆయన వస్తాడు.. అప్పుడు మాట్లాడండి అంటూ మీనా నానా మాటలు అనడంతో రోహిణి రెచ్చిపోతుంది. వాళ్ల డబ్బు వాళ్లకు పడేద్దాం అనడంతో ఎవరి...