Hyderabad, ఆగస్టు 26 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 496వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అసలు విషయం తెలుసుకొని బాలుకి సత్యం క్షమాపణ చెప్పడం, ప్రభావతి, రోహిణితోనే హారతి ఇచ్చి అతనికి స్వాగతం పలికించడం, అటు సంజూ గురించి నిజం తెలుసుకొని మీనా అతని చెంప పగలగొట్టడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (ఆగస్టు 26) ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ దగ్గర తమ్ముడు శివను మీనా నిలదీసే సీన్ తో మొదలవుతుంది. బాలు తప్పు చేయలేదని నిరూపించిన తర్వాత పోలీస్ స్టేషన్ బయట బాలు, మీనా, రవి కలిసి సంతోషంగా ఉంటారు. అదే సమయంలో గుణ కోసం శివ వస్తాడు. దీంతో మీనా అతన్ని నిలదీస్తుంది. ఇప్పటికైనా గుణ గురించి తెలుసుకో.. మీ బావ ఏ తప్పూ చేయలేదని తేలిపోయింది.. ఆ గుణకు దూరంగా ఉండకపోతే నువ్వూ జైలుకెళ్లాల్సి వస్తుందని చెబుతుంది.

అయినా శివ మాత్రం గుణన...