Hyderabad, జూలై 29 -- స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు (జులై 29) ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఈ ఎపిసోడ్ మొత్తం మీనా పూలకొట్టను కార్పొరేషన్ వాళ్లు తీసేయడం, ఇందులో రోహిణి, ప్రభావతిలను కామాక్షి నిలదీయడం, అటు బాలు కూడా ఆమెతో కలవడంలాంటి ఇంట్రెస్టింగ్ సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు మంగళవారం (జులై 29) ఎపిసోడ్ రోహిణిని ప్రభావతి తిడుతున్న సీన్ తో మొదలవుతుంది. తాను పూలు అమ్మానన్న విషయం ఆ కామాక్షికి ఎందుకు చెప్పావంటూ ఆమెను నిలదీస్తుంది. అప్పుడే కామాక్షి ఇంటికి వస్తుంది. తాను విన్నది నిజమేనా అని అడుగుతుంది.

నిన్ను బాలూలాగే అందరూ పూలావతి అని పిలుస్తున్నారట.. నీ మీద గౌరవంతో మీనా నీ పేరు మీదే పూలకొట్టు పెట్టుకుంది.. కనీసం ఆ పనైనా చేస్తుండు.. నాకైతే చిట్టీల వ్యాపారం ఉంది.. నీకు అది కూడా లేదు కదా.. ఖాళీగా కూర...