Hyderabad, సెప్టెంబర్ 3 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 502వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంటికి వచ్చిన మీనా తల్లి పార్వతిని ప్రభావతి అవమానించడం, సత్యం తల్లి సుశీల రావడం, బాలు మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కు ప్లాన్ చేయడంలాంటి సీన్లతో సాగిపోయింది. ఈ ఎపిసోడ్లో ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ బాలు, మీనా పెళ్లి రోజు కోసం బట్టలు పెట్టడానికి ఇంటికి వచ్చిన పార్వతి సీన్ తో మొదలవుతుంది. ఆమెను ప్రభావతి దారుణంగా అవమానిస్తుంది. 50 తులాల బంగారం తెచ్చారా అని వెటకారంగా అడుగుతుంది.

తల్లిపై రవి కూడా మండిపడతాడు. అటు శృతి కూడా ఇలా సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారేంటని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత బాలు, మీనాకు తాను తెచ్చిన బట్టలు, పండ్లు పెడుతుంది. వాళ్లు ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. చాలా ఖరీ...