భారతదేశం, ఫిబ్రవరి 23 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బొమ్మల కొలువుకు ఇంకొన్ని కావాలని సత్యంకు మీనా చెబుతుంది. తర్వాత రెండు బొమ్మలు చూపించి శృంగార భంగిమ అంటే ఇలాగే ఉంటుందా.. మీ దగ్గర డ్యాన్స్ ప్రేమ్ వాళ్లు ఇలాగే ఉన్నారని ప్రభావతితో మీనా అంటుంది.

దానికి షాక్ అయిన ప్రభావతి తర్వాత నీ మొహం, నీకు అన్ని తప్పుగానే కనిపిస్తాయంటుంది. అంత దగ్గరగా ఉన్నారంటే అనుమానించాల్సిందే అని బాలు అంటాడు. వాళ్లను మందలిస్తే అందరి ముందు తిట్టిందని మీనా చెబుతుంది. కళల గురించి తనకేం తెలుసు అని మనోజ్ అంటాడు. వీడికి చోరకళ తప్పా ఇంకేం తెలుసు అని బాలు పంచ్‌లు వేస్తాడు.

నేను చూశాను. రేపు ఏమైనా అయితే ఎవరిని అంటారని మీనా అంటుంది. నువ్వు ఏం నేర్పించావ్ చెప్పమని బాలు అంటాడు. దాంతో మనోజ్, రోహిణితో శృంగార భంగిమలు వేయిస్తుంది ప్రభావతి. కానీ, వారికి రాదు. శ...