భారతదేశం, డిసెంబర్ 19 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 579వ ఎపిసోడ్ మొత్తం బాలు, మీనా, మనోజ్ చుట్టే తిరుగుతుంది. తమ కొత్త కారును బాలు, మీనా.. రాజేష్ కు రెంట్ కు ఇవ్వగా.. అటు మనోజ్ తనకు వచ్చిన లేఖ చూసి భయపడుతూ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (డిసెంబర్ 19) ఎపిసోడ్ మౌనిక గురించి మీనాకు చెబుతూ బాలు ఏడ్చే సీన్ తో మొదలైంది. అసలు మౌనిక అలా ఎందుకు చేసింది.. ఆ రోజు జరిగినదాన్ని మనసులో పెట్టుకొని అలా చేసిందా అని బాలు బాధపడతాడు. మీనా అతన్ని ఓదారుస్తుంది. ఫంక్షన్ హడావిడిలో ఉండి సంజూ పక్కనే ఉండటం వల్ల అలా చేసి ఉండొచ్చు.. తర్వాత ఆమెనే ఫోన్ చేస్తుంది.. అతిగా ఆలోచించొద్దని ఓదారుస్తుంది.

అటు మౌనికతో మెల్లగా తన భార్య ఎలా ఉండాలో అలా మారుతున్నావని సంజూ అంటాడు. బాలుతో నువ్వు ఎలా ప్రవర్...