Hyderabad, జూలై 8 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జులై 8) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శృతి తాళి మార్చే వేడుకలో జరిగిన గొడవ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతాయి. బాలు, మీనా అవమానాలను ఎదుర్కొంటారు. శృతి తన తల్లి ఇంటికి వెళ్తుంది. ప్రభావతి బాలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు గత ఎపిసోడ్‌లో శృతి తాళి మార్చే ఫంక్షన్‌లో శోభ, సురేంద్రలు మీనాపై దొంగతనం ఆరోపణలు చేసి గొడవ సృష్టించారు. ఈ ఎపిసోడ్ ఆ గొడవ తర్వాతి పరిణామాలతో మొదలవుతుంది. సురేంద్ర మీనాను "దొంగ" అని పదే పదే నిందించడంతో బాలు సహనం కోల్పోతాడు.

"మీనాపై ఇలా మాట్లాడితే సహించను" అని సురేంద్ర కాలర్ పట్టుకుని ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. శృతి మధ్యలోకి వచ్చి బాలును నెట్టి.. "నా తండ్రిపై చేయి వేసేంత ధైర్యం నీకెలా వచ్...