భారతదేశం, డిసెంబర్ 4 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 568వ ఎపిసోడ్ లో ప్రభావతి వెనక్కి తగ్గకపోగా.. మరింత రచ్చ చేస్తుంది. కామాక్షి రంగంలోకి దిగినా మాట వినదు. దీంతో ఆమెకు సత్యంతో మరింత దూరం పెరిగిపోతుంది. బాలు, మీనాలకు తాను క్షమాపణ చెప్పిన సత్యం.. ప్రభావతిని అసహ్యించుకోవడం మొదలుపెడతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (డిసెంబర్ 4) ఎపిసోడ్ ప్రభావతి గురించి మీనా ఆవేదన చెందే సీన్ తో మొదలవుతుంది. అత్తయ్య గదిలో నుంచి రావడం లేదని, ఇంత గొడవ అవుతుందని తాను అనుకోలేదని మీనా అంటుంది. అమ్మ గురించి మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బాలు చెప్పినా వినదు.

దీంతో ఎవరు చెబితే ఆమె బయటకు వస్తుందో వాళ్లనే పిలిపిస్తానని బాలు అంటాడు. ఇద్దరూ కలిసి ప్రభావతిని బయటకు తీసుకురావడానికి వెళ్తారు. అప్పటికే మనోజ్, రోహిణి ఆమెను పిలుస్తున్నా పలకదు. బ...