భారతదేశం, ఫిబ్రవరి 18 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 622వ ఎపిసోడ్ లో బాలు, మీనాకు మరోసారి యాక్సిడెంట్ అవుతుంది. అయితే ఈ క్రమంలో వాళ్లకు మరో బామ్మ, తాత పరిచయం అవుతారు. అటు నీతూ విషయంలో రవి, శృతి మధ్య మరోసారి గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 18) ఎపిసోడ్ నిద్రలో నుంచి లేచి మీనా బాధపడే సీన్ తో మొదలవుతుంది. తన టైమ్ బాలేదని రోహిణి చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. తలకు దెబ్బ తగిలింది.. రేపు ఏమవుతుందో అని టెన్షన్ పడుతుంది. ఇదే విషయాన్ని బాలుతో చెబితే అతడు లైట్ తీసుకుంటాడు. భవిష్యత్తును భయంతో చూస్తే అలాగే కనిపిస్తుందని, ధైర్యంతో చూడాలని అంటాడు. అలాంటి నమ్మొద్దని ఆమెకు సర్ది చెబుతాడు. ఎక్కువగా ఆలోచిస్తే తల నొప్పి వస్తుంది పడుకోమని అంటాడు.

ఇటు రవికి రాత్రి వే...