భారతదేశం, నవంబర్ 13 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 553వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో ప్రభావతి నోరు పారేసుకోవడం, శృతి తల్లి శోభ ఎక్స్‌ట్రాలు మరోసారి గొడవ పెట్టేలా కనిపించినా.. శృతితోపాటు ఇంట్లో వాళ్ల స్పందన అలా జరగకుండా చూస్తుంది. ఇక చివర్లో నాన్నమ్మ సుశీలకు అదిరిపోయే గిఫ్ట్ ఇస్తాడు బాలు.

గుండె నిండా గుడి గంటలు గురువారం (నవంబర్ 13) ఎపిసోడ్ సుమతి పెళ్లి గురించి చర్చతో మొదలవుతుంది. నీకు పెళ్లి జరగాలంటే ఎవరికైనా యాక్సిడెంట్ జరగాల్సిందే అని ప్రభావతి అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ ఆమెపై మండిపడతారు.

అసలు నువ్వు ఆడదానివేనా అని సుశీల అంటే.. అసలు అది మనిషే కాదు అని సత్యం అంటాడు. మీనా, శృతి, రవి, చివరికి కూతురు మౌనిక కూడా ప్రభావతికి క్లాస్ పీకుతారు. అసలు అది నోరేనా, పుట్టినరోజున చావు గురించి మాట్లాడతావా అంటూ ప్రభావతిని నానా మాటలు అనడ...