భారతదేశం, జూన్ 23 -- మీనా కోసం తాను తీసుకొచ్చిన హ‌ల్వా మొత్తం మ‌నోజ్ తినేసి వెళ్లిపోవ‌డంతో బాలు డిస‌పాయింట్ అవుతాడు. తినేది లాక్కోవ‌డం బాగుండ‌ద‌ని ఆగిపోయాన‌ని అంటాడు. అందుకే మీరు న‌చ్చుతార‌ని భ‌ర్త‌పై మీనా పొగ‌డ్త‌లు కురిపిస్తుంది. మ‌రోవైపు హ‌ల్వా మ‌త్తులో ఇవాళ నాకు నేనే కొత్త‌గా క‌నిపిస్తున్నాను అని రోహిణి చేతిపై ముద్దుపెడ‌తాడు మ‌నోజ్‌. అప్పుడే ప్ర‌భావ‌తి విజిల్ సౌండ్ వినిపిస్తుంది. ఆ విజిల్ సౌండ్‌తో రొమాంటిక్ మూడ్ పోయింద‌ని మ‌నోజ్ చిరాకుప‌డ‌తాడు.

మ‌నోజ్ రూమ్ డోర్ కొడుతుంది ప్ర‌భావ‌తి. బిర్యానీ అర‌గ‌లేద‌ని ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే ఇవ్వ‌మ‌ని మ‌నోజ్‌ను అడుగుతుంది. తిన్న‌ది అర‌క్క తిప్ప‌లు ప‌డే అవ‌స‌రం త‌న‌కెప్పుడూ రాలేద‌ని మ‌నోజ్ పంచ్ వేస్తాడు.

మీనాకు బాలు ముద్దు పెట్ట‌బోతాడు. అప్పుడే హాల్‌లోకి ప్ర‌భావ‌తి వ‌స్తుండ‌టంతో బాలుకు దూరంగా జ‌రుగుత...