భారతదేశం, జనవరి 28 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 607వ ఎపిసోడ్ లో మీనాపై మరింత కక్ష కడతారు ప్రభావతి, రోహిణి. ఆమె తనను చంపడానికి ప్లాన్ చేసిందంటూ కాలు జారి పడిన ప్రభావతి నిందలు వేస్తుంది. అయితే మీనాకు సపోర్ట్ గా శృతి కాస్త గట్టిగానే క్లాస్ పీకడంతో ప్రభావతి ఆమెకు చెక్ పెట్టడానికి తల్లి శోభ దగ్గరికి వెళ్తుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జనవరి 28) ఎపిసోడ్ ప్రభావతి, మనోజ్ లను భయపడే సీన్ తో మొదలవుతుంది. దెయ్యం అంటూ మీనానే తనను భయపెట్టిందని ఆమెను తిడుతుంది ప్రభావతి. దీంతో శృతి జోక్యం చేసుకొని అది తన పని అని చెబుతుంది.

ఆమెకు కూడా వార్నింగ్ ఇచ్చి ప్రభావతి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అనవసరంగా అత్తయ్యతో పెట్టుకున్నామని మీనా బాధపడుతుంది. ఏం కాదులే అని శృతి ఆమెకు సర్ది చెబుతుంది. మరుసటి రోజు ఉదయం బాలు రాగానే జరిగిన విషయం చెబుత...