భారతదేశం, జనవరి 29 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాకు, రోహిణికి బుద్ధి చెప్పకపోతే రోహిణికి కూడా అలుసు అయిపోతాను అని ప్రభావతి అనుకుంటుంది. ఇంతలో మీనా వస్తుంది. ప్రభావతి అరుస్తుంది. అచ్చం బాలు అన్నట్లుగానే ప్రభావతి తిట్టడంతో మీనా నవ్వుతుంది.

నా వల్లే మీకు ఇలా అయిందని నాకు అనిపిస్తుంది. మీరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కాపుడం పెడితే చిటికలో నయం అవుతుంది అని మీనా అంటుంది. కానీ, ప్రభావతి వద్దంటుంది. ఇక్కడ పెడుతున్నాను. మీరే పెట్టుకోండి అని మీనా వెళ్లిపోతుంది. ప్రభావతి కాపుడం పెట్టుకుంటుంది. అది మీనా చూసి నవ్వుకుంటుంది. కాసేపు కాపుడం పెట్టుకున్నాక నీళ్లు చల్లారిపోయాయని ప్రభావతి వంటింట్లోకి వెళ్తుంది.

కషాయం తాగితే నొప్పి పోతుందని, దినుసుల కోసం వంట గదిలో సజ్జ పైకి ఎక్కి చూస్తుంది మీనా. ఇంతలో మీనా కాలు జారడంతో కారం, పిండ...