Hyderabad, అక్టోబర్ 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో తన ఇంట్లో ప్రభావతి డ్యాన్స్ స్కూల్ పెట్టుకోడానికి కామాక్షి ఒప్పుకుంటుంది. రోహిణి మాటలు వింటుంటే నువ్వు గొప్ప డ్యాన్స్ మాస్టర్‌వి అయిపోయి లక్షలు సంపాదిస్తావని అనిపిస్తోందని కామాక్షి అంటుంది. కామాక్షి థ్యాంక్యూ అని సిగ్గుపడుతూ చెబుతుంది ప్రభావతి.

తర్వాత ఇంటికి సత్యం వస్తాడు. మనం ఒక అద్భుతాన్ని చూడబోతున్నాం. అత్తయ్యను కొత్తగా చూడబోతున్నారు అని మీనా అంటే.. పాత పెళ్లాన్ని కొత్తగా చూస్తానా అని సత్యం అంటాడు. అత్తయ్య భరతనాట్యం స్కూల్ పెట్టబోతున్నారు అని మీనా చెప్పేసరికి సత్యం ఉలిక్కిపడతాడు. నాట్య గురువు అయి భరతనాట్యం నేర్పిస్తారట. కామాక్షి ఇంట్లో డ్యాన్స్ స్కూల్ పెడతారంటా. అత్తయ్య డ్యాన్స్ బాగా చేస్తారు అని మీనా చెబుతుంది.

ఇలాంటి వయసులో ఇలాంటి భయానక దృశ్యాలని చూడాలని రా...