Hyderabad, అక్టోబర్ 13 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 530వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ను ముగ్గురు కోడళ్లు కలిసి మొదలుపెట్టడం దగ్గరి నుంచి ఒక్క స్టూడెంట్ కూడా రాక ప్రభావతి ఈగలు తోలడం వరకు కాస్త సరదాగా సాగిపోయింది. చివరికి అత్తపై మీనా జాలి చూపించి తొలి విద్యార్థిగా ఆమెనే వచ్చి చేరుతుంది.

గుండె నిండా గుడి గంటలు సోమవారం (అక్టోబర్ 13) ఎపిసోడ్ మొత్తం ప్రభావతి డ్యాన్స్ స్కూల్ చుట్టే తిరిగింది. ఎపిసోడ్ మొదట్లోనే రిబ్బన్ కటింగ్ విషయంలో మరోసారి రచ్చ జరుగుతుంది. మీనాతో చేయిద్దామని సత్యం అంటే ప్రభావతి వద్దంటుంది. దీంతో బాలు మరోసారి ఆమెపై విరుచుకుపడతాడు.

అయితే ప్రభావతికి సపోర్ట్ గా రోహిణి, మనోజ్, రవి, శృతి వస్తారు. దీంతో చేసేది లేక మనకు లక్ష్మీ, పార్వతి, సరస్వతిలాగా ముగ్గురు కోడళ్లు ఉన్నారు కదా.. ముగ్గురితోనూ చేయిద్ద...