భారతదేశం, డిసెంబర్ 23 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బెస్ట్ కపుల్ పోటీలో కచ్చితంగా గెలుస్తామని, లక్ష వస్తే బాలు గాడికి రెండు నెలల డబ్బు ఇవ్వొచ్చని రోహిణిని ఒప్పిస్తాడు మనోజ్. ఇంట్లో చెబుతామా అని రోహిణి అంటే.. వద్దు. వాళ్లు కూడా వస్తారు. చెప్పకు అని మనోజ్ అంటాడు. మరోవైపు రవి, శ్రుతి కూడా కాంపిటీషన్ గురించి మాట్లాడుకుంటారు.

ముందు వెళ్లి పాల్గొందాం. ప్రైజ్ రాని రాకపోని. నాకు ఇలాంటివి అంటే ఇష్టం అని శ్రుతి అంటాడు. మరి ఫిజికల్ టాస్క్‌లు పెడితే ఎలా. ప్రాక్టీస్ చేయొద్దా అని రవి అంటే.. నేను రోజు ఎక్సర్‌సైజ్ చేస్తానుగా. చాలా స్ట్రాంగ్ అని శ్రుతి అంటుంది. అయితే చూద్దామా అని రవి, శ్రుతి ఇద్దరు ఫిజికల్‌గా తలపడి బల ప్రయోగం చేసుకుంటారు. మరోవైపు పడుకున్న సత్యంను లేపి బెస్ట్ కపుల్ పోటీ గురించి చెబుతుంది.

ఆదర్శ దంపతుల పోటీల్లో గెలవ...