Hyderabad, జూన్ 24 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి నల్లపూసల ఫంక్షన్‌కు బాలు రాకూడదని చెప్పారని సత్యంతో ప్రభావతి చెబుతుంది. వస్తే ఏం అవుతుందట. వాళ్లు తండ్రి నా రిటైర్‌మెంట్ రోజు ఎంతగా అవమానించారో మర్చిపోయారా. అదంతా అప్పుడు జరిగిపోయింది. ఇప్పుడు మనం బంధువులం అయ్యాం అని సత్యం అంటాడు.

మనమందరం వెళ్దాం. కానీ, బాలు ఒక్కడు వద్దని ప్రభావతి అంటుంది. ఆ మాటలు విన్న మీనా ఎక్కడికి అని సత్యంను అడుగుతుంది. ప్రభావతి చెప్పింది సత్యం చెబుతాడు. మౌనిక ఫంక్షన్‌లో ఎంత అవమానించారు. మా ఆయన ఏమైనా గొడవ పడ్డారా. ఎప్పుడు కాలు దువ్వడమే ఆయన పనా. కన్నతల్లిలా మాట్లాడమని చెప్పండి మావయ్య అని సపోర్ట్ చేస్తుంది మీనా.

మీ తమ్ముడి చేయి కూడా విరగగొట్టాడు. నాకు చెబుతున్నావా. అక్కడ ఏదైనా చేస్తే వాళ్ల పరువు, మన పరువు పోతుందని ప్రభావతి అంటుంది. ఇంతలో బాల...