భారతదేశం, జనవరి 26 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 605వ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. దొరికిపోతుందనుకున్న రోహిణి.. చివరికి మీనాను టార్గెట్ చేస్తుంది. అటు సుమతి జాబ్ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఎపిసోడ్ చివర్లో ప్రభావతి, మనోజ్ లను లక్ష్యంగా చేసుకొని శృతి, మీనా భయపెట్టడం నవ్వులు తెప్పించింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ సోమవారం (జనవరి 26) ఎపిసోడ్ మీనాను ప్రభావతి, రోహిణి లక్ష్యంగా చేసుకొని తిట్టే సీన్ తో మొదలవుతుంది. అయితే ఆమెకు మద్దతుగా బాలు, సత్యం నిలుస్తారు. మీనా చేసిన తప్పేంటి? ఉన్న నిజమే కదా చెప్పింది అని బాలు అంటాడు.

అలా చూస్తే ఈ ఇంట్లో తప్పు చేయంది ఎవరు.. మనోజ్ గాడు నా రూ.40 లక్షలు ముంచాడు.. నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి రోహిణికి పార్లర్ పెట్టించావు.. రవిగాడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు అంటూ సత్యం కూడా ప్రభావతిని...