Hyderabad, ఆగస్టు 8 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 484వ ఎపిసోడ్ లో కల్పనను తీసుకొని మనోజ్, రోహిణి.. తన బండి కోసం మీనా పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. ఈ ఎపిసోడ్ మొత్తం ఆసక్తికర మలుపులతో సాగింది. చివరికి నెక్ట్స్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తి పెంచేలా ముగించారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ శుక్రవారం (ఆగస్టు 8) ఎపిసోడ్ కల్పనను బాలు ఏకంగా రోహిణి బ్యూటీ పార్లర్ కే తీసుకొచ్చే సీన్ తో మొదలువుతుంది. తనకు తెలిసిన మంచి పార్లర్ ఉందంటూ ఆమెను రోహిణి పని చేసే పార్లర్ కు తీసుకొచ్చి దిగబెడతాడు. లోపలికి వెళ్లిన కల్పన తనకు ఫేషియల్ చేయాలని రోహిణిని అడుగుతుంది.

ఆమెను చూడగానే రోహిణి షాక్ తింటుంది. గతంలో మనోజ్ తనకు చూపించిన ఫొటోలోని అమ్మాయి ఈమెనే అని తెలుసుకుంటుంది. ఆమె పేరు కూడా కనుక్కోవడంతో కన్ఫమ్ అవుతుంది. వెంటనే మనోజ్ కు ఫోన్ చేస్తుంది. నీకు డబ్బు ...