Hyderabad, సెప్టెంబర్ 11 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 508వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కొనసాగాయి. అయితే సంజూకి బాలు గట్టి వార్నింగ్ ఇచ్చి పంపించడం, రోహిణికి ప్రభావతి మళ్లీ క్లాస్ పీకడం, అటు సుశీల కూడా బాలు, మీనా పరిస్థితి చూసి ఇంట్లో వాళ్లను నిలదీయడంలాంటి సీన్లతో ఈ ఎపిసోడ్ సాగింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (సెప్టెంబర్ 11) ఎపిసోడ్ బాలు, మీనా పెళ్లి రోజు సందర్భంగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. ప్రభావతి కూడా మాట్లాడాలని సుశీల ఒత్తిడి చేస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడుతుంది. బాలుని పుట్టినప్పటి నుంచి తాను భరించలేకపోతున్నానని అంటుంది.

వీళ్ల పెళ్లి తనకు ఇష్టం లేకుండా జరిగిందని, మీనా కూడా వీడిని భరించలేక వెళ్లిపోతుందని అనుకున్నానని చెబుతుంది. కానీ మీనా మాత్రం వాడు ఏం చేసినా ...