భారతదేశం, జనవరి 21 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 602వ ఎపిసోడ్ లో శుభవార్త అంటూ ఇటు రోహిణి, అటు బాలు స్వీట్లు పంచుతారు. కానీ చివర్లో రోహిణి గురించి అసలు నిజం తెలిసిన ప్రభావతి ఆమెను నిలదీస్తుంది. దీంతో ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (జనవరి 21) ఎపిసోడ్ బాలుతో మీనా పిచ్చిదానిలా ప్రవర్తించే సీన్ తో మొదలవుతుంది. మన ఇల్లు ఇదేనా.. ఇక్కడికి ఎప్పుడు మార్చారు.. రెండోసారి డెలివరీయా.. అయితే మొదటిసారి బిడ్డను కనే ఉంటుంది కదా అని ఏదేదో మాట్లాడటంతో బాలు కూడా టెన్షన్ పడతాడు. అయితే తనకు అర్జెంట్ గా ట్రిప్ వచ్చిందని, నొప్పులతో బాధపడుతున్న మహిళను హాస్పిటల్ కు తీసుకెళ్లాలని వెళ్లిపోతాడు.

ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రభావతితోనూ మీనా అలాగే ఉంటుంది. టీ పెట్టమంటే టీవీ పెడుతుంది. రెండ...