Hyderabad, ఆగస్టు 7 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మీనాను వద్దని రోహిణితో ముగ్గు వేయించాలని ప్రభావతి చూస్తుంది. నాకు ముగ్గు వేయడం రాదని రోహిణి అంటుంది. దీక్షలో ఉన్నప్పుడు ఇలా చేయాల్సిందే అని ప్రభావతి అంటుంది. ఏదోటి వేసేయమ్మా. మీ అత్తయ్య వదిలేలా లేదని సత్యం అంటాడు. మనోజ్ కూడా మీ నాన్న కోసమేగా అని మనోజ్ అంటాడు.

బాలు సెటైర్లు వేస్తాడు. మీనాను మనోజ్ హెల్ప్ చేయమంటాడు. నేను వేసే పిచ్చిగీతలు ఎందుకు, అత్తయ్య రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలిచారుగా అని కౌంటర్స్ వేస్తుంది. ఏంటే ఎగతాళిగా ఉందా అని ప్రభావతి కోప్పడుతుంది. తర్వాత రోహిణి ఏదోలా ముగ్గు వేస్తే బాలు కౌంటర్స్ వేస్తూ వెళ్లిపోతాడు. తర్వాత మీనా చేసిన టిఫిన్‌ను రవి, శ్రుతి మెచ్చుకుంటారు.

రవి కంటే నువ్వే బెటర్. హోటల్ పెడితే బాగా ఫేమస్ అవుతావ్ అని శ్రుతి అంటుంది. అలాంటి ఐడియాలు ఇవ...