భారతదేశం, నవంబర్ 11 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో పుట్టింటికి వెళ్లడానికి మౌనికకు అత్త పర్మిషన్ ఇస్తుంది. కారు వరకు వదిలిపెట్టిన అత్తతో మౌనిక ఎందుకు మాటిచ్చారంటుంది. సంజు రాత్రి వరకు రానన్నాడు. అప్పటిలోపు వచ్చేసేయ్ అని మౌనికకు చెబుతుంది అత్త. దాంతో రవి వాళ్లతో మౌనిక వెళ్తుంది.

మరోవైపు బాలును ఏమన్నావ్ అని ప్రభావతిని నిలదీస్తుంది సుశీల. నాకేం తెలుసు అని ప్రభావతి అంటుంది. ఏనాడైనా కన్న కొడుకు అనే ప్రేమ చూపించావా అని తిడుతుంది సుశీల. ఇంతలో రవి వాళ్లు వస్తారు. మౌనిక రావడంతో అంతా సంతోషిస్తారు. సుశీలను హగ్ చేసుకుంటుంది మౌనిక. మౌనికకు నానమ్మ పుట్టినరోజు గురించి చెప్పకపోవడం గురించి మాట్లాడుకుంటారు.

మౌనికకు కాల్ చేయమని ప్రభావతికి చెప్పినట్లు సత్యం చెబుతాడు. దీపావళికే రాలేదని చేయలేదంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి వచ్చి సుశీలకు ...